అక్రమంగా వసూలు చేస్తే చర్యలు తప్పవు: సీఐ

Wed,March 20, 2019 12:31 AM

రామవరం: రుద్రంపూర్ ట్రాన్స్‌పోర్టు, లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు అక్రమ వసూళ్లను చేపట్టవద్దని చేపడితే శాఖా పరమైన చర్యలు తప్పవని కొత్తగూడెం టూటౌన్ ఏరియా ఇన్‌స్పెక్టర్ తుమ్మగోపి అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని 5ఇైంక్లెన్ ప్రాంతంనుంచి వివిధ ప్రాంతాలకు లారీలద్వారా బొగ్గు రవాణా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలోని కోల్ ట్రాన్స్‌పోర్టర్లు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల మధ్య వసూలు చేస్తున్న డబ్బులపై వివాదం నెలకొని పోలీసుల దృష్టికి వెళ్లడం కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం.అలీ ఇరుపక్షాలను పిలిపించి ఎవ్వరూకూడా డబ్బులు వసూలు చేయవద్దని హెచ్చరించారు. అందులో భాగంగా టూటౌన్ ఇన్‌స్పెక్టర్ ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొన్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరుగకుండా ఉండేదుకు ఎవ్వరూ కూడా అక్రమవసూళ్లకు పాల్పడవద్దని పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరగుతుందని ఎవరైన అతిక్రమిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఫోన్‌నెంబర్లతోకూడిన ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles