గెలిపించిన ప్రజలకు న్యాయం చేసేందుకే టీఆర్‌ఎస్‌లోకి..

Tue,March 19, 2019 01:53 AM

-నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ హామీ
-కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
-టీఆర్‌ఎస్‌లో చేరిక నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన కాంగ్రెస్ శ్రేణులు
-డీసీసీ పదవికి రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి నమస్తేతెలంగాణ/పాల్వంచ: కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కొత్తగూడెం ఎమ్మె ల్యే వనమా వెంకటేశ్వరరావు వెల్లడించారు. పాతపాల్వంచలోని ఆయన స్వగృహంలో సోమవారం అభిమానులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి హైదరాబాద్ నుంచి పాల్వంచకు వచ్చిన సందర్భంగా ఆయనను కలుసుకునేందుకు తరలివచ్చిన కార్యకర్తలతో ఆయన జరిగిన పరిణామాలను వివరించారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయినట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో కలుసుకుని గంట పాటు నియోజకవర్గం గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. పూర్తిస్థాయిలోనియోజకవర్గం అభివృద్ధి కోసం సహాయ సహకారం అందించడమే కాకుండ తనకు ప్రాధాన్యం కూడా ఇస్తానని కేసీఆర్ హమీ ఇచ్చారని ఆ యన తెలిపారు. తనకు స్వతహాగా ఎలాంటి ఆశలు లేవని కేవలం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధికి సాయం చేయాలని సీఎంను కోరడం జరిగిందని ఆయన తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా అన్ని విధాలు ప్రాధాన్యం ఇస్తానని కూడా భరోసా ఇచ్చారని వనమా కార్యకర్తలకు వివరించారు.

కార్యకర్తల అభిమానుల నిర్ణయాన్ని తీసుకున్న తరువాతనే టీఆర్‌ఎస్‌లో చేరతానని సీఎం కేసీఆర్‌కు చెప్పడం జరిగిందని వనమా తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో ఉంటే అభివృద్ధి కుంటుపడుతుందనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌లో చేరాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే గా రాజీనామా చేసి తిరిగి టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో వరుసగా రెండు సార్లు టీ ఆర్‌ఎస్ ప్రభుత్వంఏర్పాటు కావడం ఆయనపై ప్రజలకు ఉన్న అభిమానానికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. అభివృద్ధి కోసం అం దరూ సీఎం కేసీఆర్ వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నారని, తాను కూడా అభివృద్ధి కోసమే ఆయన వెంటే ఉండి పనిచేయాలనుకున్నానన్నారు. టీఆర్‌ఎస్ లో చేరినా కూడాపార్టీలోని అందరినీ కూడా కలుపుకుని పనిచేస్తానని, అందరికీ గౌర వం ఇస్తానని ఈ సందర్భంగా ఆ యన హామీ ఇచ్చారు. ఒక విజన్‌తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాల గురించి కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టిక్కెట్ కోసం అనేక కష్టనష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీనియర్ నాయకుడనైన తనను చాలా ఇబ్బందులు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఏకగ్రీవంగా ఆమోదించిన కాంగ్రెస్ శ్రేణులు..
ఎమ్మెల్యే వనమా నిర్ణయాన్ని ఆ పార్టీ శ్రేణులు ఆయన నివాసానికి వచ్చి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, పార్టీకి చెంది న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వనమా తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. తా మంతా ఇందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పార్టీలోని అత్యంత కీలకమైన వ్యక్తులంతా వనమాకు అండగా నిలుస్తామని ప్రకటించారు.

వనమాను సన్మానించిన టీఆర్‌ఎస్ నాయకులు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును ఆయన స్వగృహంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీఆర్‌ఎస్ పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్‌లు కలుసుకుని సన్మానం చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఆయనకు పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం వనమా వెంకటేశ్వరరావు కార్యకర్తల, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సం బురాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవీ భద్రం, ఎంఏ రజాక్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల ఉమారాణి, సొ సైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతి, కాంగ్రెస్ నాయకులు వనమా రాఘవేంద్రరావు, కాసుల వెంకట్, తూము చౌదరి, చందా మల్లేష్, బపపటి ప్రసాద్, సకినాల వెంకన్న, ఎర్రంశెట్టి ముత్తయ్య, మహిపతి రామలింగం, కొత్వాల సత్యనారాయణ, ఎలుకా చంద ర్, పౌల్, కోటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, జక్కుల సుందర్, చాట్ల వినోద్, రమాకాంత్, హ మీద్, యాకూబ్ ఖాన్, భద్ర, ఓం ప్రకాష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles