నామినేషన్ల ఘట్టానికి శ్రీకారం..!


Tue,March 19, 2019 01:51 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నోటిఫి కేషన్‌ను జిల్లా కలెక్టర్, ఖమ్మం లోక్‌సభ ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. తొలిరోజు నామినేషన్లు ఏమీ దాఖలు కాలేదు.జిల్లాలోని ప్రధా న రాజకీయ పార్టీలు ఇప్పటివరకు వారి పార్టీల అభ్యర్థులను నిర్ణయించలేదు.ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలకు గడువు ఉం డటంతో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహుర్తం చూసుకొని నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.కలెక్టరేట్ వద్ద బారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.కలెక్టరేట్‌లో పని చేసే ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతించారు.వారు కూడా వారి ఐడెంటిటీ కార్డు చూపిస్తేనే లోపలి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కార్యాలయం ప్రధాన గేటు వద్ద లోపలి వైపు మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.కలెక్టర్ కార్యాలయానికి వంద మీటర్ల లోపు 144 సెక్షన్‌ను విధించారు.పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్భాల్ కలెక్టర్ కర్ణన్‌ను కలిశారు. నామినేషన్‌లు దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులు వంద మీటర్ల అవతలనే నిలుపుదల చేసేల పోలీసులు ఏర్పాటు చేశారు. ఆయా అభ్యర్థులకు చెందిన మూడు వాహనాలను మాత్రమే లోపలికి అనుమతిచ్చేల పోలీసులు చర్యలు తీసుకున్నారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీకావడంతో సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వచ్చే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం - మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోకి వస్తాయి. జిల్లా నుంచి ఏ ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. తొలి రోజు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎలాంటి నామినేషన్లు దాఖలుకాలేదు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారుకాకపోవడంతో ఎవరు ఎప్పుడు నామినేషన్లు దాఖలుచేస్తారనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి గడువుగా నిర్ణయించారు. ఎన్నికల నియమ, నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రాలను భర్తీ చేసి అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. పార్లమెంట్ స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు ఆ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles