జీఓలు సాధించే ఎమ్మెల్సీనే గెలిపించాలి

Mon,March 18, 2019 01:30 AM

-పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోత్కూరి మధు
ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 17 : ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు సాధించే పీఆర్‌టీయూ ఎమ్మెల్సీనే గెలిపించాలని ఆ సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మోత్కూరి మధు, ఆర్ రంగారావు కోరారు. ఖమ్మం నగరంలోని పీఆర్‌టీయూ సంఘం భవనంలో ఆదివారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఈనెల 22న జరగబోయే ఎన్నికల్లో తమ సంఘ అధికారిక అభ్యర్థి పూల రవీందర్ మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే గెలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నిక జరుగుతున్న రెండు స్ధానాలు గెలవడం ద్వారా ఇప్పటికే ఉన్న ఒక ఎమ్మెల్సీతో కలుపుకుని మూడుస్థానాల్లో శాసనమండలిలో ప్రతిపక్ష హోదా కూడా తామే సాధిస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఉపాధ్యాయుల సంఘాలు, భావజాలాలకు అతీతంగా సీపీఎస్, సీసీఈ రద్దు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఉన్నతీకరణ, ఏకీకృత సర్వీస్ నిబంధనల అమలు, పీఆర్‌సీ సాధన జరగాలంటే పీఆర్‌టీయూ ద్వారానే సాధ్యమవుతుందని నమ్ముతున్నారని మధు పేర్కొన్నారు. ఖమ్మంజిల్లాలో తాము అత్యధిక మోజార్టీ ఓట్లు పొందనున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు విజయ్ అమృత్‌కుమార్, బాధ్యులు సైదయ్య, యలమద్ది వెంకటేశ్వర్లు, కట్టా శేఖర్‌రావు, సోమ్లా, రెబ్బా శ్రీనివాసరావు, హరిత, దామోధర్‌రెడ్డి, సాదె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles