రేపు భద్రాద్రిలో రాష్ట్రస్థాయి కోలాటం పోటీలు

Sat,February 23, 2019 12:58 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం పట్టణంలో భద్రాద్రి కళా నిలయం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రస్థాయి మహిళా కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు పోటీల పర్యవేక్షకులు గోళ్ల భూపతిరావు, చారుగుళ్ల శ్రీనివాసరావు, భద్రాద్రి కళా నిలయం అధ్యక్షుడు జీవీలు తెలిపారు. స్థానిక టీఎస్ టూరిజం హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇందుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఈనెల 24న ఉదయం 9నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పోటీలు జరుగుతాయని, మొత్తం 20 టీమ్‌లు ఇందులో పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.8వేలు, ప్రశంసా పత్రాలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి రూ.4వేలు, ప్రశంసాపత్రాలు, మూడవ బహుమతి రూ.2వేలు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కోలాట ప్రదర్శన 5నిమిషాలు ఉంటుందని వివరించారు. పోటీల్లో పాల్గొనే కళాకారులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో గడ్డం అశోక్, భీమవరపు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles