వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు

Fri,February 22, 2019 12:04 AM

బయ్యారం : చల్లంగా చూడాలి తల్లులూ అంటూ వన దేవతలు సమ్మక్క సారక్కలను భక్తులు వేడుకున్నారు. మండలంలోని నామాలపాడు నంది మేడారం, గంధంపల్లి సమ్మక్క సారక్క ఆలయాల్లో మినీ మేడారం జాతర గురువారంతో ముగిసింది. ఇప్పటికే సారలమ్మ గద్దెల పైకి చురుకోగా గురువారం సమ్మక్క తల్లి భక్తుల డ్యాన్స్‌లు, శివ సత్తుల పూనకాల మధ్య గద్దె పైకి చేరుకుంది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాకుండా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే గంధంపల్లి సమ్మక్క సారక్క ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన సతీమణి లక్ష్మీ అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఎంపీ సీతారాంనాయక్, మహబుబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌లు అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆచార సంప్రాదాయాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆలయ పూజారి ఇమ్మడి సురేష్ ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ జయశ్రీ, వైస్ ఎంపీపీ మధుకర్‌రెడ్డి, నాయకులు బుచ్చిరెడ్డి, ఐలయ్య, గోపాల్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, కిరణ్, వీరస్వామి, వెంకటపతి, శ్రీనివాసరావు, శ్రీకాంత్, సోమిరెడ్డి పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles