రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Wed,February 20, 2019 12:14 AM

-జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ద్విచక్రవాహన ప్రమాదాలు
- వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు.. ఎదురుగా వచ్చి మరొకరు.. ఆటో ఢీకొని ఇంకొకరు మృతి
ఆళ్లపల్లి, ఫిబ్రవరి19: జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ద్విచక్షికవాహనాలపై వెళ్లుతుండగా ఈ ప్రమాదాలు జరిగాయి. ఆళ్లపల్లి మండలంలోని కాంచనపల్లి సమీపంలో ఒకరు.. దమ్మపేట మండలంలోని మల్లారం సమీపంలో మరొకరు.. ఇల్లెందు మండలం రెపల్లెవాడ సమీపంలో ఇంకొకరు మరణించారు. ఆళ్లపల్లి మండలంలోని పాతూరు గ్రామానికి చెందిన కొమరం అంజయ్య (45) సోమవారం సాయంత్రం కాచనపల్లికి బ్యాంక్ పని నిమిత్తం వెళి ్లవసున్నాడు. అతని వాహనం వెనుకనే వస్తున్న ఇప్పనపల్లి గ్రామానికి చెందిన ఈసం శివాజి ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని దాటే ప్రయత్నంలో మూల మలుపు వద్ద అదుపు తప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అంజయ్యను స్థానికులు 10 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపవూతికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles