నెరవేరిన ఏజెన్సీ ప్రజల కల

Tue,February 19, 2019 12:51 AM

-సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
-వంద పడకల ఆసుపత్రిలో వైద్యసేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు, నమస్తే తెలంగాణ : మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఎన్నో ఏండ్ల ఏజెన్సీ ప్రజల కల నెరవేరింది. పినపాక నియోజకవర్గ ప్రజలకు వందపడకల ఆసుపత్రిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మణుగూరు మండల కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల ఏజెన్సీ ప్రాంత ప్రజల కల నెరవేరిందన్నారు. 2018లో గెలిచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వంద పడకల ఆసుపత్రి సమస్యను తీసుకెళ్లి వైద్య సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరగానే వెంటనే వైద్య సేవలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఆదేశించిందే తడువుగా హైద్రాబాద్ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్, డీసీహెచ్‌వో రమేష్ ఇక్కడే ఉండి వైద్య సేవలను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మరోమారు సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తానన్నారు. ప్రస్తుతం ఓపీ సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. మరో 20 రోజుల్లో ఆసుపత్రిలో పూర్తిస్థాయి సిబ్బంది వస్తారని, అన్ని వేళలా వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ కమిషనర్ అశోక్‌కుమార్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్, డీఎంఅండ్‌హెచ్‌వో భాస్కర్‌నాయక్, డీఈ హుస్సేన్, ఏఈ అనుదీప్, డాక్టర్లు పర్షానాయక్, స్వాతిశ్రీ, మమత, రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles