పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటండి

Sun,January 20, 2019 11:57 PM

దుమ్ముగూడెం: తొలివిడుత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులు సత్తా చాటాలని మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. ఆదివారం మండల పరిధి పర్ణశాలలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను ఆయన పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పర్ణశాల పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచిందని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రూ.29 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతామని, ఐటీ సీ సహకారంతో పూర్తిగా గార్డెన్‌ను నిర్మించేందుకు చర్య లు తీసుకుంటున్నట్లు తెలిపారు. పిల్లలు ఆడుకునేందుకు పార్కును ఏర్పాటు చేస్తామని, ఇందకు అందరి సహకారం అవసరమన్నారు. పార్లమెంట్ స్పీకర్ సుమి త్రా మహాజన్, సుష్మా స్వరాజ్‌లను కలిసి పర్ణశాల ఆలయ ప్రసాదాన్ని అందజేసి శాలువాతో సత్కరించి విషయాన్ని ప్రస్తావించినట్లు ఎంపీ తెలిపారు. త్వరలో వారు భద్రాచలం రానున్నారని, ఆ సమయంలో పర్ణశాల అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మండలంలో అన్ని పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. 25న మండలంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు.

నేడు జరిగే పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని, అభ్యర్ధ్థులు సైతం టీఆర్‌ఎస్ విజయానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తండాలను గూడేలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దుమ్ముగూడెం నదిలో ఎస్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టు ఉండటంతో రైతులకు నీరందడంలేదని ఎంపీ దృష్టికి రైతులు తీసుకువెళ్లగా ఇరిగేషన్ ఎస్‌ఈని పిలిచి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల అనంతరం సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. ప్రగళ్లపల్లి లిఫ్ట్ విషయాన్ని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని పేర్కాన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానే రామకృష్ణ, ఎంపీపీ తెల్లం సీతమ్మ, జడ్పీటీసీ అన్నెం సత్యాలు, సీనియర్ నాయకులు ఎస్‌ఏ రసూల్, మండల అధ్యక్షుడు తోటమళ్ల సుధాకర్, కార్యదర్శి లక్ష్మణ్, శ్రీనివాసరాజు, జోగా బుజ్జి, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

147
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles