సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా..


Sun,January 20, 2019 11:57 PM

కొత్తగూడెం క్రైం: పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులతో కలిసి అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ సునీల్‌దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు, సిబ్బందిని కోరారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు నిర్భయంగా ముందడుగు వేయాలన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురి చేసే నాయకులు, కార్యకర్తలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. పోలీస్, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.


సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
మొదటి దఫాలో 174 పంచాయతీలు, 22 వార్డులతో సహా ఏకగ్రీవ తీర్మానాలు జరిగాయని, మొత్తం 1534 వార్డుల్లో 130 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగాయన్నారు. 174 పంచాయతీల్లో 59 పంచాయతీలను మావోయిస్టు ప్రభావిత పంచాయతీలుగా, 20 పంచాయతీలను సమస్యాత్మక పంచాయతీలుగా, 95 పంచాయతీలను సారధారణ పంచాయతీలుగా గుర్తించామన్నారు.

- రెండో దఫాలో మొత్తం 142 పంచాయతీలకు వార్డులతో సహా 17 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిందని, మొత్తం 1294 పంచాయతీల్లో 289 వార్డులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. 142 పంచాయతీలతో 17 పంచాయతీలు మావోయిస్టు ప్రభావిత పంచాయతీలుగా, 10 పంచాయతీలను సమస్యాత్మక, 115 పంచాయతీలు సాధారణ పంచాయతీలుగా గుర్తించినట్లు తెలిపారు.

- మూడో దఫాలో మొత్తం 163 పంచాయతీలు, 1404 వార్డులకు సంబంధించిన సమాచారం సేకరించాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈ పంచాయతీల్లో 31 పంచాయతీలు మావోయిస్టు ప్రభావిత,, 21 పంచాయతీలు సమస్యాత్మక, 111 పంచాయతీలు సాధారణ పంచాయతీలుగా గుర్తించామని పేర్కొన్నారు.

మొదటి దఫా ఎన్నికల బందోబస్తు..
- భద్రాచలం సబ్‌డివిజన్ పరిధిలో : ఒక ఏఎస్పీ, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లు, 8మంది ఎస్సైలు, 20మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 15మంది ఏఆర్‌హెచ్‌సీలు, 25మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 85మంది హోంగార్డులు, ఇతర శాఖలకు చెందిన 150మందిని బందోబస్తుకు కేటాయించారు.

- మణుగూరు సబ్‌డివిజన్ పరిధిలో : ఇద్దరు డీఎస్పీలు, 8మంది ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 20మంది, 105మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు 16 మంది, 15 మంది ఏఆర్‌హెచ్‌సీలు, 34 మంది ఏఆర్‌పీసీలు, 25మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 21 మంది టీఎస్‌ఎస్‌పీ సిబ్బంది, 25మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని బందోబస్తుకి కేటాయించారు.

- పాల్వంచ సబ్‌డివిజన్ పరిధిలో : ఒక ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు, 10మంది ఎస్సైలు, 50మంది ఏఎస్సైలు, హెచ్‌సీలు, 160మంది పీసీలు, 40మంది మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు, 35మంది స్పెషల్ పార్టీ సిబ్బంది, 120 మంది హోంగార్డులు, 25మంది సిబ్బందిని కేటాయించారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles