డేకేర్ సెంటర్ ఏర్పాటు అభినందనీయం..

Sun,January 20, 2019 11:57 PM

- సీనియర్ సిటిజన్ సేవలు ప్రశంసనీయం : ట్రైనీ ఐఏఎస్ అధికారులు
మయూరిసెంటర్, జనవరి 20: కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల సంక్షేమం, జిల్లా కేంద్రంలో డేకేర్ సెంటర్ సేవలు అభినందనీయమని శిక్షణ ఐఏఎస్ అధికారుల బృందం పేర్కొంది. ఆదివారం సాయంత్రం శిక్షణ ఐఏఎస్ అధికారుల బృందం డేకేర్ సెంటర్‌ను సందర్శించారు. సీనియర్ సిటిజన్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. నగరంలో మొట్టమొదటి సారిగా వయోవృద్ధుల కోసం కలెక్టర్ కర్ణన్ ప్రత్యేక చొరవతో డేకేర్ సెంటర్ ద్వారా వృద్ధులకు ఆసరాను కల్పించడం సంతోషదాయకమన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఖమ్మం నగర పరిధి, జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ కార్యాలయాలు, వాటి విభాగాలు, వృద్ధుల సంక్షేమానికి చెందిన పలు అంశాలు, ఖమ్మం కార్పొరేషన్‌లో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాల వివరించారు. డేకేర్ సంటర్‌లో ఏర్పాటు చేసిన జిమ్, లైబ్రరీ, ఓపెన్‌జిమ్‌ల గురించి వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ మాట్లాడుతూ వృద్ధులకు ఆరోగ్యసేవలను అందించేందుకు తన సతీమణి డాక్టర్ విజయలక్ష్మి వారికి ప్రతిరోజు ఉచితంగా వైద్యపరీక్షలు, మందులను అందిస్తున్నారన్నారు. వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్‌ను, అక్కడ ఏర్పాటు చేసిన వసతులు శిక్షణ ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా తిలకించారు. సీనియర్ సిటిజన్స్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, సత్యనారాయణ, నర్సయ్య, శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, రాధాకృష్ణ, విజయరాజు, వెంకటేశ్వర్లు వీరారావు, పుల్లారావు, అసద్ అలీ, వీరభద్రం, ఉపేందర్‌రెడ్డి నరసింహారావు, తాతా రాఘవయ్య, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles