పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం..


Sun,January 20, 2019 01:30 AM

-గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చింది కేసీఆరే..
-తండాలు, గూడేలను పంచాయతీలుగా చేసిన ఘనత టీఆర్
-జూన్ నాటికి గిరిజన, గిరిజనేతర రైతాంగానికి హక్కుపత్రాలు..
-మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్
ఇల్లెందు నమస్తే తెలంగాణ: పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతామని మహబూబాబాద్ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. ఇల్లెందు సింగరేణి గెస్ట్ శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలకు వన్నె తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆరే అన్నారు. గ్రామాల్లో గ్రామస్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకే గూడెలు, తండాలను పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. తండాలు, గూడెలు పంచాయతీలు కావడం వలన పరిపాలన సులవవుతుందని, పథకాలు మరిన్ని చేరువవుతాయన్నారు. తమ గూడెలు, పంచాయతీలను తామే పరిపాలించుకుంటున్నామనే భావన సీఎం కేసీఆర్ గిరిజనుల్లో కల్పించారన్నారు. నూత న పంచాయతీ సవరణ చట్టం తీసుకొచ్చి పంచాయతీలను చేసినందుకు ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలన్నారు. ఏకగ్రీవం చేసుకోవడం ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయని, తద్వారా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, నాయకులు కనగాల పేర య్య, పులిగళ్ల మాధవరావు, జాని పాల్గొన్నారు.


జూన్ నాటికి గిరిజన, గిరిజనేతర
రైతాంగానికి హక్కుపత్రాలు ..
టేకులపల్లి : జిల్లాలోని పోడురైతాంగానికి అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతాంగం అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. శనివారం భద్రాచలం వెళ్తూ మార్గం మధ్యలో జడ్పీటీసీ లక్కినేని సురేందర్ స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందన్నారు. వచ్చే జూన్ నాటికి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉన్న పోడుభూముల సమస్యకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికతో కేంద్రం దృష్టికి తీసుకవెళ్లి వందశాతం న్యాయం చేయనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోడుసాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతాంగానికి పట్టాలు మంజూరు కావడం ఖాయమన్నారు. దేశంలోనే గుర్తింపు పొందిన రైతుబంధు పథకాన్ని ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారంటే ఆ ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని హర్షం వ్య క్తం చేశారు. తండాలు, గుంపులు ఏకమై గులాబీ జెండాలు ఎత్తుకోవాలని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ చేయ డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశం లో జడ్పీటీసీ లక్కినేని సురేందర్, టీఆర్ నా యకులు జానీ, లాకావత్ లింబ్యా, బానోత్ రవి, ఇస్లావత్ దేవ్ చందులాల్ పాల్గొన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles