పోలింగ్ ప్రక్రియపై అవగాహన కలిగి ఉండాలి

Sun,January 20, 2019 01:27 AM

-ఎన్నికల అబ్జర్వర్ నిర్మల
కొత్తగూడెం అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎన్నికల అబ్జర్వర్ నిర్మల అన్నారు. శనివారం డీఆర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీశాఖ ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్లుగా నియమించిన బ్యాంక్ అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. ఎన్నికలను అత్యంత కట్టుదిట్ట భద్రత నడుమ నిర్వహిస్తున్నందున అధికారులు సహకరించాలన్నారు. అనంతరం బ్యాంక్ అధికారులకు ట్రైనర్ నర్సింహాకుమార్ వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలని, 200మీటర్ల దూరంలో ఎటువంటి పోస్టర్లు, బ్యానర్లు, ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయరాదని, 100మీటర్ల పరిధిలో ఎటువంటి వాహనాలు నిలుపరాదని, పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు ఎటువంటి ప్రచారం చేయరాదనే నిబంధన తెలుసుకోవాలన్నారు. వెబ్ లేనిచోట మైక్రో అబ్జర్వర్లదే ప్రధానపాత్ర ఉంటుందన్నారు. 200 ఓటర్లలోపు ఒక ప్రిసైడింగ్ అధికారి, మరొక పోలింగ్ అధికారి మాత్రమే ఉంటారని, 200పైగా ఓటర్లు ఉంటే ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ఇద్దరు పోలింగ్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. గుర్తింపుకార్డు ఉంటేనే పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని, ఓటు హక్కు వినియోగం రహస్యంగా జరిగే విధంగా మైక్రో అబ్జర్వర్లు పరిశీలించాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 13 గుర్తింపుకార్డులను ఉపయోగించుకోవచ్చన్నారు. ఎడమ చేతి వేలు మధ్య సిరాచుక్కా, అలాగే ప్రిసైడింగ్ జాబితాలో ఉన్న పేరు, ఏజెంట్ వద్ద ఉన్న పేరు ఒకే విధంగా ఉన్నాదా? లేదా? పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో ఆశాలత, లీడ్ బ్యాంక్ మేనేజర్ పుల్లారావు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles