జూన్ నాటికి గిరిజన, గిరిజనేతర


Sun,January 20, 2019 01:26 AM

-రైతాంగానికి హక్కుపత్రాలు ..
టేకులపల్లి : జిల్లాలోని పోడురైతాంగానికి అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. పోడు సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతాంగం అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. శనివారం భద్రాచలం వెళ్తూ మార్గం మధ్యలో జడ్పీటీసీ లక్కినేని సురేందర్ స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ దక్కిందన్నారు. వచ్చే జూన్ నాటికి జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ప్రధానంగా ఉన్న పోడుభూముల సమస్యకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికతో కేంద్రం దృష్టికి తీసుకవెళ్లి వందశాతం న్యాయం చేయనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోడుసాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర రైతాంగానికి పట్టాలు మంజూరు కావడం ఖాయమన్నారు. దేశంలోనే గుర్తింపు పొందిన రైతుబంధు పథకాన్ని ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారంటే ఆ ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందని హర్షం వ్య క్తం చేశారు. తండాలు, గుంపులు ఏకమై గులాబీ జెండాలు ఎత్తుకోవాలని పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ బలపరిచిన అభ్యర్థులు క్లీన్ చేయ డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశం లో జడ్పీటీసీ లక్కినేని సురేందర్, టీఆర్ నా యకులు జానీ, లాకావత్ లింబ్యా, బానోత్ రవి, ఇస్లావత్ దేవ్ చందులాల్ పాల్గొన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles