ఖమ్మంలో వెల్ సెంటర్


Sat,January 19, 2019 12:20 AM

మయూరిసెంటర్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ప్రత్యేకంగా విశ్రాంత, ప్రభుత్వ ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులకు ఔట్ విభాగంలో వైద్యసేవలను అందిస్తూ వెల్ సెంటర్ ద్వారా ప్రభుత్వ వైద్యులు తమ వైద్య సేవలను రోగులకు అందిస్తున్నారు. పలు విభాగాలకు చెందిన పరికరాలు, వైద్యులు, వైద్యసిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యసేవలను అందిస్తూ వస్తున్నారు. గతంలో విశ్రాంత ఉద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులు నిత్యం 24 గంటల పాటు వార్తాసేకరణలో నిమగ్నమై ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే వర్కింగ్, రిటైర్డ్ జర్నలిస్టులకు కూడా ఈ వెల్ సెంటర్ ఏర్పాటుతో సుదూర ప్రాంతాలైన వరంగల్, హైద్రాబాద్ వెళ్లకుండా ఆయా విభాగాలకు చెందిన హెల్త్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించి మందులు అందించే సదుపాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభసూచికమని వైద్యసేవలు పొందుతున్న బాదితులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ కర్ణన్ గత అక్టోబర్ 29 వ తేదీన వెల్ సెంటర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గల నూతన భవనంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బీపీ, షుగర్, ఈసీజీ, ఇతర స్కానింగ్ చెందిన అత్యాధునిక పరికరాలు, ఇతర మౌలిక వసతులతో వెల్ సెంటర్ రోగులకు అందుబాటులో ఉంది. ఇతర వైద్య పరీక్షలను సైతం వెల్ సెంటర్ సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ తీసుకుని బాధితులకు రిపోర్ట్స్ అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో వెల్ ఏర్పాటుతో ఉద్యోగులు, జర్నలిస్టులకు వర ప్రదాయినిగా మారింది.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles