సీఎల్పీ నేతగా భట్టీ విక్రమార్క


Sat,January 19, 2019 12:20 AM

ఖమ్మం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభా పక్ష (సీఎల్పీ) నేత ఎంపికపై సస్పెన్స్ వీడింది. సీఎల్పీ నేతగా ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. సీఎల్పీ నేత ఎన్నిక పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ గత రెండు రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సీఎల్పీ నేత నియామకంపై సమాలోచనలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. గురువారం ఉదయం శాసన సభ కమిటీ హాల్ కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరిగింది. కేసీ వేణుగోపాల్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పార్టీ రాష్ట్ర ఇన్ ఆర్ కుంతియా, 19 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఏక వాక్య తీర్మానంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీకి పంపడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది.. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2007లో ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో రెండవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో మూడవ సారి విజయం సాధించారు. హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. 2011-14 డిప్యూటీ స్పీకర్ ఛీప్ విప్ పనిచేశారు. 1990-92లో పీసీసీ మెంబర్ 2000- 03పీసీసీ కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2016లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పనిచేశారు. 2018 ఎన్నికలో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పనిచేశారు. భట్టి విక్రమార్క ఎన్నికతో మధిర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles