సంతోషంగా నామినేషన్


Sat,January 19, 2019 12:20 AM

-టీన్యూస్ ఎండీ సంతోష్దత్తత గ్రామం లచ్చగూడెంలో టీఆర్ శ్రేణుల భారీ ర్యాలీ
-సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్
ఇల్లెందు రూరల్, జనవరి 18 : ‘టీన్యూస్’ ఎండీ, రాజ్యసభ సభ్యుడు సంతోష్ దత్తత గ్రామమైన లచ్చగూడెం నుంచి టీఆర్ శ్రేణులు శుక్రవారం భారీ ర్యాలీతో సర్పంచ్, వార్డు సభ్యులకు నామినేషన్ వేశారు. గ్రామంలో టీన్యూఎస్ ఎండీ సంతోష్ చేసిన అభివృద్ధి స్పూర్తితో గ్రామస్తులంతా ఐక్యంగా నామినేషన్ ప్రక్రియకు తరలిరావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లచ్చగూడెం గ్రామం నుంచి చల్లసముద్రం గ్రామపంచాయతీ కార్యాలయం వరకు నాలుగు కిలోమీటర్ల మేర కొనసాగిన ప్రదర్శనలో మహిళలు, పెద్దలు పాల్గొన్నారు. గ్రామస్తులు ఐక్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులచే నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా లచ్చగూడెం ‘మైఫోర్స్’ ప్రతినిధి సంజీవరెడ్డి, గుంటి కృష్ణ మాట్లాడుతూ.. హరితహారం పథకంలో భాగంగా గ్రామంలో, శివారు ప్రాంతంలోని ఖాళీ స్థలంలో సంతోష్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటామన్నారు.


గ్రామస్తుల ఐక్యతను మెచ్చిన టీన్యూఎస్ ఎండీ సంతోష్ తన దత్తత గ్రామంగా లచ్చగూడేన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామానికి ఇచ్చిన హామీలను మరిచిపోకుండా పలు అభివృద్ధి పనులు మంజూరు చేయించారని హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో లోవోల్టేజీ నివారణకు రూ.1.5 కోట్ల వ్యయంతో సబ్ నిర్మాణం, చల్లసముద్రం ఆర్ రోడ్డు నుంచి లచ్చగూడెం గ్రామం వరకు రూ.3 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణం, ప్రత్యేకంగా గ్రామపంచాయతీ ఏర్పాటు, గ్రామ శివారులోని చెరువు పునరుద్ధ్దరణకు ప్రత్యేక నిధులు, గ్రామంలో కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం నిర్మాణం కోసం నిధుల మంజూరు వంటి అనేక అభివృద్ధి పనులను గ్రామానికి అందించారని హర్షం వ్యక్తం చేశారు. నేడు ఒక చిన్న గ్రామం నుంచి వందల సంఖ్యలో జనంతో ర్యాలీ నిర్వహించడమే సంతోష్ అందించిన స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. గ్రామపంచాయతీ పరిధిలో నూరు శాతం ప్రజాప్రతినిధులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుంటి శ్రీనివాస్, గుంటి వెంకటేశ్వర్లు, బయ్య వేణు, నూనావత్ ప్రతాప్, రంగినేని వెంకటరెడ్డి, నాగిరెడ్డి, నాగ్ ఎనిక నరేష్, కమటం మాధవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles