పోలీస్ స్టేషన్ 5ఎఎస్ విధానం అమలు


Sat,January 19, 2019 12:19 AM

రామవరం: గతంలో పోలీస్ ఉన్న ఫైల్స్ ఉన్న సమాచారాన్ని వెతకాలంటే సమయ భావంతో పాటు అదనంగా సిబ్బందిని కేటాయించిన పరిస్థితి వచ్చేది. సమాచారం, సరైన సమయంలో అందించాలంటే ఒక క్రమపద్ధతిలో ప్రతి ఫైల్ ఉంచాలనే లక్ష్యంతో 5 ఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల సమాచారాన్ని శరవేగంగా పంపించే అవకాశం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు ఎస్ చెన్నూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం టూటౌన్ పోలీసులు పోలీస్ 5 ఎస్ విధానం ప్రకారం కేసుల ఫైళ్లను అమర్చారు. అన్నిరకాల ఫైల్స్ ఓ క్రమ పద్ధతిలో అమర్చారు నిత్యం పోలీస్ జరిగే ప్రక్రియ అనుగుణంగా ఫైల్స్ అందుబాటలో ఉండే విధంగా అమర్చారు. రిసెప్షన్ డ్యూటీ ఆఫీసర్ కోర్టు డ్యూటీ ఆఫీసర్, మిగిలిన విధులకు సంబంధించిన రిజిస్టర్లన్నింటినీ ఒక వరుసలో ఉంచే విధంగా ఏర్పాటు చేశారు. ఏ కేసుకు సంబంధించిన ఫైల్స్ అయినా వెంటనే వెతికి పట్టుకునే విధంగా వాటిని ఏర్పాటు చేసుకున్నారు. సక్రమంగా అమర్చిన సిబ్బంది పనితీరును సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మేకల కుమారస్వామి, రైటర్ రాందాస్, భీముడు తదితరులుఉన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles