మూడో విడత పోరుకు ముగిసిన నామినేషన్లు

Sat,January 19, 2019 12:19 AM

-సర్పంచ్ పదవులకు 982 నామినేషన్లు దాఖలు
-వార్డు స్థానాలకు 3819 నామినేషన్లు దాఖలు
-నేడు స్క్రూట్నీ22న ఉపసంహరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా చివరి ఘట్టమైన మూడవ దశ నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో రావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రాంగణంలోకి సాయంత్రం ఐదు గంటల్లోగా వచ్చిన వారిని అధికారులు అనుమతించారు. దీంతో నామినేషన్ల స్వీకరణ రాత్రి వరకూ కొనసాగింది. మొత్తం 163 సర్పంచ్ స్థానాలకు 982 నామినేషన్లు, 1404 వార్డు మెంబర్ల పదవులకు 3819 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. టేకులపల్లి మండలం గొల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పది పంచాయతీల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా వివరాలు అందలేదు. అవి మినహా మిగతా మండలాల్లో పంచాయతీల సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి..

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles