రెండో రోజు భారీగా నామినేషన్లు


Fri,January 18, 2019 01:02 AM

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్థానిక పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆశయంతో ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీల ఎన్నికల నిర్వహణ చివరి దశగా మూడవ విడత నామినేషన్ల ఘట్టం గురువారం కూడా కొనసాగింది. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో పంచాయతీ ఎన్నికల మూడు దశల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం ఆసన్నమవుతోంది. కనుమ సందర్భంగా తొలిరోజు కేవలం రెండంకెలకే పరిమితమైన నామినేషన్ల సంఖ్య రెండో రోజు భారీగా జరిగింది. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎక్కడ చూసినా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు కోలాహలంగా కనిపించాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో మూడవ విడత పోలింగ్ ఈనెల 30న జరగనుంది. ఇందుకోసం 163 సర్పంచ్ పదవులకు 331, మొత్తం 1404 వార్డు మెంబర్ల స్థానాలకు 978 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు సర్పంచ్, వార్డు స్థానాలకు కేవలం 26 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా ఊహించని రీతిలో మూడంకెలకు పెరిగిన రెండు సంఖ్యలు కలిసి నాలుగంకెలుగా రూపుదాల్చాయి. మూడో దశ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు దాఖలైన నామినేషన్లను బట్టి స్పష్టమవుతోంది. మూడో విడత రెండవ రోజు దాఖలైన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల వివరాలు..

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles