ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి


Fri,January 18, 2019 01:02 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పంచాయతీ తొలిదశ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ పేర్కొన్నారు. శాంతిభద్రల నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పోలీసు శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌తో కలిసి పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆయా దశల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, ట్రైనీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కొత్తగూడెం ఆర్డీవో కనకం స్వర్ణలత, జిల్లా పంచాయతీ అధికారి ఆర్‌ఏఎస్‌పీ ఆశాలత, కొత్తగూడెం, భధ్రాచలం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ డీఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles