పల్లెల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం


Thu,January 17, 2019 01:46 AM

ఇల్లెందు రూరల్, జనవరి 16 : స్వరాష్ట్రంలోనే గిరిజన గూడాలకు గుర్తింపు లభించిందని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని మొండితోగు గ్రామ పంచాయతీ కుమ్మరికుంట గ్రామంలో 46 కుటుంబాలు బుధవారం కోరం కనకయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాలను సైతం చిన్న పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. స్థానికులకే పరిపాలన అవకాశం కల్పించి పల్లెల సమాగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఏజెన్సీ ప్రజలు ఎదుర్కొంటున్న పోడు వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, ఇటీవల ఇల్లెందులో నిర్వహించిన సభలో తన లక్ష్యాన్ని ప్రజలకు వివరించారని చెప్పారు.


దీనికోసం ఇప్పటికే అటవీ, ప్రభుత్వ శాఖల భూముల సర్వే జరుగుతోందన్నారు. ఇన్నాళ్లు పెట్టుబడిదారుల కబందహస్తాలో నలిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతకు రైతుబంధు పథకం ఊపిరిపోసిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా కుటుంబాలకు భరోసానిచ్చారని గుర్తుచేశారు. పోడు భూములకు సైతం రైతు బంధు పథకం వర్తింప చేసి రైతులకు మేలు చేకూర్చారని చెప్పారు. పింఛన్లు రెట్టింపు చేయడంతో పాటు నిరుద్యోగ బృతి అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల ఇళ్ళలో యువతులకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం కేసీఆర్‌కు మరింత బలాన్ని చేకూర్చేందుకు గ్రామ పంచాయతీలన్నింటిని టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకునేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాల సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ పులిగళ్ళ మాధవరావు, నాయకులు మండల రాముమహేష్, బోళ్ళ సూర్యం, కరీం, సొల్లేటి రామకృష్ణ, చుంచు వెంకటేశ్వర్లు, వీరభద్రం, ఎర్రం ఐలయ్య, బందెల భాస్కర్, తీగల రఘు, పాయం చిరంజీవి, సందీప్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles