బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలి

Thu,January 17, 2019 01:46 AM

- ఎమ్మెల్యే రాములునాయక్ టీఆర్‌ఎస్‌లో 30 కుటుంబాలు చేరిక
జూలూరుపాడు : బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ కోరారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని గురువాగుతండా పంచాయతీకి చెందిన వివిధ పార్టీలకు చెందిన 30 కుటుంబాలు టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే రాములునాయక్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీస్థాయిలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలతో పట్టణ స్థాయి ప్రజల నుంచి పల్లె ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతు పండిచిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమష్టిగా పనిచేసి మెజార్టీ పంచాయతీలను కైవసం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు దుద్దుకూరి నర్సింహరావు, దుద్దుకూరి మధుసూదన్‌రావు, యల్లంకి చిన్న నాగేశ్వరరావు, నున్నా రంగారావు, యల్లంకి పుల్లయ్య, యండపల్లి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles