గౌతంఖని ఓసీ అరుదైన రికార్డు


Tue,January 15, 2019 05:01 AM

రామవరం, జనవరి 14: సింగరేణి చరిత్రలోనే అరుదైన రికార్డును సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓపెన్‌కాస్టు నెలకొల్పింది. సోమవారం మొదటి షిప్టు పూర్తయ్యేసమయానికి కంపెనీ నిర్ధేశించిన 2018-19 ఆర్థిక సంవత్సరం నిర్ధేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యం 30లక్షల టన్నులకుగాను 30 లక్షల 922 టన్నులు బొగ్గు ఉత్పత్తిని చేసి 76 రోజుల ముందుగానే నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించిందని ఈ ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల 68 వేల420 టన్నుల రవాణా సాధించడం జరిగిందని ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా మొట్టిమొదటి వార్షికోత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఏకైక గనిగా గుర్తింపు పొందడం హర్షించదగ్గ విషయమని గని ప్రాజెక్టు ఆఫీసర్ శాలెంరాజు అన్నారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ నిర్ధేశించిన కంపెనీ లక్ష్యసాదనలో బాగంగా అధికారులు కార్మికుల సహకారంతోనే సింగరేణికి సంక్రాంతి కానుకగా ఈ విజయాన్ని అందిస్తున్నామని పీవో తెలిపారు. ఈ అత్యధిక ఉత్పత్తి రవాణాకు సహకరించిన ఉద్యోగులకు సీహెచ్‌పీ ఉద్యోగులు, ఈపీ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, సూపర్‌వైజర్లు, అన్ని కార్మిక సంఘాల నాయకులకు అధికారులకు మేనేజర్‌కు ప్రత్యేకంగా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. కార్మిక సోదరులందరికీ సంక్రాంతి పడుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ ఎ.కరుణాకర్, ప్రాజెక్టు ఇంజినీరు వీరభద్రుడు, టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ చెరిపల్లి నాగరాజు, కార్మికులు పాల్గొన్నారు.


ప్రతి ఆర్థిక సంవత్సరంలో అరుదైన రికార్డులు
రికార్డులను తిరగరాస్తూ సరికొత్త రికార్డులను సింగరేణి కొత్తగూడెం ఏరియా జీకేవోసీ నెలకొల్పుతుందని ఏరియా జీఎం కేవీ రమణమూర్తి అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానుకొత్తగూడెం ఏరియా జీకేవోసీకి నిర్ధేశించబడిన 30 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సోమవారం వరకు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం జరిగిందని ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 కంటే ముందుగానే లక్ష్యాన్ని చేధించింది. 76 రోజులు మిగిలి ఉండగానే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం గర్వించదగ్గ విషమని జీఎం అన్నారు. సింగరేణి సంస్థ మొత్తంలో ఏ ఇతర గని ఓపెన్‌కాస్టులు ఇన్ని రోజులు మిగిలి ఉండగానే ఉత్తత్తి లక్ష్యాన్ని సాధించడం జరగలేదని అదేవిధంగా గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా ఉత్పత్తి లక్ష్యాన్ని జీకేవోసీ ముందగానే సాధిస్తూ కొత్తగూడెం ఏరియాకి తలమానికంగా మారిందని అన్నారు. జీకేవోసీ ప్రారంభమైనప్పటి (1993 నుంచి) 2009-10 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 35.92 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రాజెక్టు ఆఫీసర్ శాలెంరాజు, మేనేజర్ కే కరుణాకర్‌రావు, జీకేవోసీ కార్మికులను, సూపర్‌వైజర్లను, అధికారులను, సహకరించిన యూనియన్ ప్రతినిధులను జీఎం, ఎస్‌వోటూ జీఎం ఆర్ నారాయణరావు, ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కొత్తగూడెం ఏరియాలోని కార్మికులకు, సూపర్‌వైజర్లకు, అధికారులకు, యూనియన్ ప్రతినిధులకు సింగరేణి కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles