నిబంధనలు కచ్చితంగా పాటించండి


Tue,January 15, 2019 05:00 AM

- జిల్లా ఎన్నికల వ్యయ పరీశీలకుడు వీరభద్రరావు
పాల్వంచ రూరల్, జనవరి 14: రానున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు వీరభ్రదరావు అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్ధులకు ఎన్నికల వ్యయంపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్ధులు పంచాయతీ ఎన్నికల్లో రూ.లక్షన్నర నుంచి రెండన్నర లక్షల వరకు, వార్డు సభ్యులు రూ.30 వేల నుంచి 50 వేల వరకు ఖర్చు చేయవచ్చునన్నారు. ఖర్చుల వివరాలు ప్రతీరోజు ఎంపీడీవోకు తెలియజేయాలన్నారు. ఎన్నికలయ్యేంత వరకు తాను మూడుసార్లు అభ్యర్థుల ఖర్చు వివరాలను పరిశీలిస్తానని, దీనికి తోడు సర్పంచ్ అభ్యర్ధుల ఖర్చు వివరాలను పరిశీలించేందకు మూడు ప్రత్యేక బృందాలు ఉన్నాయన్నారు. ఎన్నికల తర్వాత అభ్యర్థులు ఓడినా, గెలిచినా వారి ఖర్చు వివరాలను తెలియజేయాలన్నారు. లేనిచో వారిపై ఏ ఏన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుందన్నారు. పార్టీలతో ప్రమేయం లేకుండా వ్యక్థిగతంగా విజయం సాధించాలని, జెండాలు, పోస్టర్లు అంచటించరాదన్నారు. ప్రచార వాహనాలకు పోలీసుల నుంచి అనుమతి తప్పక తీసుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్, ఏఈవో చక్రవర్తి, సూపరిండెంట్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలి
మణుగూరు, నమస్తేతెలంగాణ (బూర్గంపాడు), జనవరి14: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు వీరభ్రదరావు అన్నారు. ఆయన సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎన్నికల ఖర్చుల అభ్జర్వర్‌లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులు నామినేషన్ దాఖాలు చేసిన రోజు నుంచి ఖర్చుల వివరాలను అందజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో ఆర్‌వీ సుబ్రమణ్యం, మహేష్, నాగార్జున, ఈవోఆర్డీ దేవకరుణ తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles