పండగ చేద్దాం పదండి!


Mon,January 14, 2019 01:27 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: సంక్రాతి సంబురాలకు సర్వం సిద్ధమైంది. సంక్రాంతి అంటే మొదట గుర్తుకు వచ్చే ది రంగవల్లులు, గొబ్బెమ్మలు, బోగిపండ్లు, బోగి మంటలు, కోడిపందేలు, డూడూ బసవన్నలు, గాలిపటాలు, పిండివంటలు, పంటలు పూర్తయి ఇంటికి వచ్చే ధాన్యపు రాసులు. పండుగకు ముందు పదిరోజుల ముందు నుంచే ఇళ్ల ముందు రకరకాల ముగ్గులతో అమ్మాయిలు ఒకరితో ఒకరు పోటీలు పడుతుంటారు. ఈ పండుగ రోజుల్లో అందరి గృహాలు కొత్త అల్లుళ్లు, బంధుమిత్రులతో కళకళలాడుతుంటాయి. సంక్రాంతి అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక మకర సంక్రాంతి అని పిలుస్తారు. సంక్రాంతికి ముందురోజు వచ్చే పండుగ బోగి. తరువాత వచ్చేది కనుమ. సంక్రాంతి రోజున రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు స్వాగతం పలుకుతుంటాయి. పండుగకు పదిరోజుల ముందు నుంచే పిండివంటల తయారీ హడావుడి ప్రారంభమవుతుంది.


భోగ భాగ్యాల బోగి...మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ బోగి. ఈ పండుగ రోజు ఇంట్లో వారంతా వేకువజామునే లేచి ఇంట్లో ఉన్న పుల్లలు, పాతసామగ్రి, ఆవుపేడతో చేసిన పిడక లు మొదలైన వాటితో మంటలు వేస్తారు.
సంక్రాంతి.. వేకువజామునే లేచి స్నానాలు చేసి ఆడపడుచులు ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటే.. పెద్ద వాళ్లు ఇంటికి తోరణాలు కడతారు. సేమియా, పాయసం, గారె లు మొదలైన పిండివంటలను ఆరగించి.. పనివారికి, రజకులకు, క్షురకులకు, ఇంకా ఇంటి చుట్టుపక్కల వారికి వండుకున్న పిండివంటలను రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యే కం. అత్తవారింటికి వెళ్లడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ రోజును పితృతర్పణాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒక ఎత్తు అయితే.. దీనికి ముందు, వెనుక వచ్చే బోగి, కనుమ అంతే ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

కనుమ..కనుమ పండుగ సంక్రాంతి తర్వాత వస్తుం ది. ఈరోజున పశువులకు పూజ చేస్తారు. కనుమకు తినే వారు మాంసాహారం, మినప గారెలు వండుకుంటారు. దీని తర్వాత వచ్చే పండుగ ముక్కనుమ.ఈ పండుగకు పల్లెటూళ్లలో మంచి సందడి నెలకొంటుంది. అయితే పట్టణాల్లో ఈ పండుగ ప్రత్యేకతను చాటేందుకు బొగిమంటలు వేయడంతోపాటు ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ.. గాలిపటాల పోటీలను నిర్వహిస్తూ పండుగ శో భను మర్చిపోకుండా చూస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles