ఖమ్మంలో రెండో విడతకు ముగిసిన నామినేషన్లు

Mon,January 14, 2019 01:26 AM

- 204 గ్రామ పంచాయితీలకు 661 నామినేషన్లు
-1862 వార్డు పదవులకు 2999 నామినేషన్లు
-నేటి నుంచి స్క్రూట్నీ మొదలు..
ఖమ్మం, నమస్తే తెలంగాణ : ఖమ్మం జిల్లాలోరెండో విడత ఎన్నికల్లో భాగంగా మూడో రోజు గ్రామపంచాయతీలలో నామినేషన్ల జోరు కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో రెండో విడత జరగనున్న ఎన్నికల సమరంలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీచేసే అభ్యర్థులతో నామినేషన్లు వేసేందుకు భారీగా కదిలారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 7 మండలాల్లోని 204 గ్రామ పంచాయతీలు, 1862 వార్డుల పాలక వర్గాల ఎన్నికలకు నామినేషన్లు కొనసాగాయి. టీఆర్ శ్రేణులు జిల్లాలో అధిక పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఇప్పటికే పంచాయతీల వారీగా నాయకులను అప్రమత్తం చేశారు. మండల స్థాయిలో సమన్వయ కమిటీలు గ్రామాలలో పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా అందరి ఆమోదంతో సరైన అభ్యర్థిని ఎన్నుకుని నామినేషన్లు వేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 14 వ తేదీన అభ్యర్థులపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. 15 వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు పోటీ నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అలాగే అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన పాలకవర్గాలు, గ్రామపంచాయతీల జాబితాను కూడా ప్రకటిస్తారు.
మూడో రోజు నామినేషన్లు ఇలా...
జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో జరగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికలలో మూడవ రోజు నా మినేషన్ల జోరు కనిపించింది. సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉత్సాహాంగా తమ మద్దతు దారులతో నామినేషన్ పత్రా లు దాఖలు చేశారు. పార్టీలు బలపరిచిన అభ్యర్థులను తమ నాయకులు వెంట పెట్టుకుని వచ్చి నామినేషన్లు వేయించారు.

93
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles