గడప గడపకూ సంక్షేమ పథకాలు..


Mon,January 14, 2019 01:25 AM

ఇల్లెందు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓటు అభ్యర్థించాలని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని సుభాష్ గ్రామ పంచాయతీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా అవకాశం రావడం గొప్ప వరంగా భావించాలని అభ్యర్థులకు సూచించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించి ధీమాగా ప్రజలను ఓట్లు అడిగే హక్కును సీఎం కేసీఆర్ మనకు కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు రానున్న రోజుల్లో మరింత పురోగతితో ఎలా అమలు చేయనున్నారో కూడా ఓటర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఓటరును నేరుగా కలిసి ఓటు అభ్యర్థించాలన్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు విశ్రమించొద్దని స్పష్టం చేశారు. సుభాష్ గ్రామ పంచాయతీలో గడిచిన నాలుగున్నరేళ్ళుగా చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలన్నారు. చాలా వరకు మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చామని చెప్పారు.


లలితాపురంలో డబుల్ ఇండ్లను మంజూరు చేశామని, వాటిలో ప్రస్తతం లబ్ధిదారులు నివాసం కూడా ఉంటున్నారని గుర్తుచేశారు. సుభాష్ ప్రధాన కూడళిని సుందరం గా తీర్చిదిద్దామని చెప్పారు. వీటితోపాటు ప్రభుత్వ సం క్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి అందించిన ఘనత టీఆర్ మాత్రమే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా సుభాష్ పంచాయతీలో టీఆర్ బలపర్చిన అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సుభాష్ సర్పంచి అభ్యర్థిగా పాయం మంగమ్మ, 1వ వార్డుకు యలగందుల స్వాతి, 2వ వార్డుకు మాడిశెట్టి స్పందన, 3వ వార్డుకు నెలవెల్లి నర్సింహారావు, 4వ వార్డుకు కొలిపాక కవిత, 5వ వార్డుకు గుమ్మడి అపర్ణ, 6వ వార్డుకు ఊరకొండ ధనుంజయ్, 7వ వార్డుకు భూక్య కమల, 8వ వార్డుకు ఇర్ప కోటేష్, 9వ వార్డుకు బానోత్ జైత్రాంనాయక్, 10వ వార్డుకు వాసం కల్పన, 11వ వార్డుకు ఆళ్ళ నాగేశ్వరరావు, 12వ వార్డుకు వజ్జ శ్రీనివాస్ ఉన్నారు. సర్పంచితోపాటు 12 మంది సభ్యులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందని స్పష్టం చేశారు. శీలం రమేష్, మండల రాముమహేష్, కొలిపాక శ్రీనివాస్, మాడిశెట్టి మహేందర్, లక్ష్మయ్య, శ్రీకాంత్, పాయం నర్సయ్య పాల్గొన్నారు.

93
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles