18 నుంచి జేఎల్ పోస్టులకు స్తంభాల పరీక్ష


Sun,January 13, 2019 12:50 AM

ఖమ్మం వైరారోడ్, జనవరి 12: తెలంగాణ నార్త్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ (ఎన్ జూనియర్ లైన్ (జేఎల్ పోస్టులను భర్తీ చేసేందుకు విద్యుత్ అధికారులు ముందడుగు వేశారు. గత సంవత్సరం విద్యుత్ జేఎల్ పోస్టులకు ఆన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. పరీక్షల్లో అర్హులైన అభ్యర్థులకు స్తంభాల పరీక్షలను నిర్వహించే తరుణంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ అగిపోయింది. అర్హులైన అభ్యర్థులు పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో విద్యుత్ సీఎండీలు ప్రత్యేక చోరవతో ఎలక్షన్ కమిషన్ కోరారు. దీంతో ఎలక్షన్ కమిషన్ అగిపోయిన జేఎల్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో శనివారం ఖమ్మం సర్కిల్ విద్యుత్ షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 356 మంది అభ్యర్థులు పోటీ పరీక్షల్లో అర్హత సాధించారు. వారందరికి కాల్ లెటర్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు విద్యుత్ శాఖాధికారులు తెలుపుతున్నారు. ఆదేశాలతో జేఎల్ పోస్టుల పరీక్షలు నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి 28 వరకు ఫోల్ పరీక్షలు, విద్యార్హత ధృవ పత్రాల పరిశీలన కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.


ఖమ్మం సర్కిల్ ఫోల్ ైక్లెమింగ్ పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అర్హులైన 356 మంది అభ్యర్థులకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఫోల్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి 28 వరకు దఫాల వారీగా 356 మంది అభ్యర్థులకు ఫోల్ ైక్లెమింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఫోల్ ైక్లెమింగ్ పరీక్షలకు ప్రత్యేక అధికారుల నేతృత్వంలో జరగనున్నాయి. ఫోల్ ైక్లెమింగ్ పరీక్షలు వీడియో ద్వారా రికార్డు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపించడం జరుగుతుందని, దాంతో పాటు అభ్యర్థులకు నేరుగా ఫోల్ పరీక్షల తేదీలన ఫోన్ల ద్వారా సమాచారం ఇవ్వనున్నారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles