పకడ్బందీగా ‘ఈ-చలాన్’ అమలు


Sat,January 12, 2019 01:00 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ, జనవరి 11 : ట్రాఫిక్ నియమాలను ఎవరైనా సరే ఉల్లంఘిస్తే ఈ-చలాన్ సిస్టమ్ ద్వారా జరిమానా విధించడం జరుగుతుందని మణుగూరు డీఎస్పీ రాయిళ్ళ సాయిబాబా అన్నారు. ఆయన శుక్రవారం మణుగూరు పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ఈ-చలాన్ సిస్టమ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ-చలాన్ పద్ధతి ద్వారా ఇక ఆన్ ఛలానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దన్నారు. ఈ-ఛలాన్ ద్వారా వెహికిల్ ఫోటో, వెహికల్ నంబర్ ఫోటోతో ఆన్ కేసు నమోదవుతుందన్నారు. తన రక్షణకు, ఎదుటివారి రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు ధరించాలన్నారు. వెహికిల్ నంబర్, డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, సెల్ డ్రైవింగ్ చేసినా వెంటనే కేసు నమోదు చేస్తామన్నారు. ఆ వెహికిల్ స్థానిక పోలీస్ తరలిస్తామన్నారు. ఈ-ఛలాన్ పద్ధతిలో రూ. 500 నుంచి రూ. 10వేల వరకు జరిమాన విధిస్తామన్నారు. ప్రతీ ఒక్క వాహన దారుడు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు సీఐ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles