మత్స్య కారులకు మహర్దశ..


Fri,September 21, 2018 11:44 PM

కొత్తగూడెం నమస్తే తెలంగాణ : తెలంగాణ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. సీమాంధ్ర పాలనలో ఒడిదుడుకులకు గురైన కుటుంబాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన మార్పులు వచ్చాయి. కొన్నేళ్లుగా చెరువుల్లో నీరు లేక, వలసగా మారిని వారి జీవితాలకు మిషన్ కాకతీయ పథకం బతుకు దెరువును ఇచ్చింది. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్థరణ పనులు చేపట్టి రైతులకు, మత్స్యకారులకు ఉపయోగంలోకి తీసుకొచ్చారు. దీంతో మత్స్యకారులు చేపల చెరువుల పురోగతితో ఆర్థికంగా బలోపేతమయ్యారు. ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది.

రూ. 1.35 కోట్లతో ప్రణాళిక..
జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు రూ.1.35 కోట్ల నిధులు కేటాయిస్తూ మత్స్యశాఖ ప్రణాళిక తయారు చేసింది. చేప పిల్లలను ఇప్పటికే గుత్తేదారులు టెండర్ల ద్వారా ఆంధ్రా నుంచి తీసుకొచ్చి వదిలేందుకు సిద్ధమయ్యారు. 657 సీజనల్ ట్యాంకుల్లో 1.14 కోట్లు, మరో 39 పెద్ద చెరువుల్లో 67.47 లక్షల చేప పిల్లలను వదలనున్నారు. శనివారం కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలంలో సింగభూపాలెం చెరువులో 7.41 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదలనున్నారు. ఇప్పటికి 90 లక్షల చేపపిల్లలను సొసైటీల పరిధిలో మత్స్యకుటుంబాలకు పంపిణీ చేశారు.

గతేడాది కోటికి పైగా చేపపిల్లలు..
జిల్లాలో గతేడాది రూ.109 లక్షల చేపపిల్లను 271 చెరువుల్లో వదలగా వారంతా పెరిగిన చేపల ద్వారా లబ్ధి పొందారు. సొసైటీల ద్వారా లబ్ధి పొందుతున్న మత్స్యకారులకు మరింత చేయూతగా గ్రామాలకు వెళ్లి చేపలను విక్రయించేందుకు టూవీలర్ వాహనాలను కూడా ఇచ్చేందుకు కార్యాచరణ చేసింది. ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. వారం రోజుల్లో వాహనాలను అందించనున్నారు. ఇందుకు 176 టూవీలర్ వాహనాలు జిల్లా కార్యాలయానికి చేరాయి.

బలోపేతం కానున్న సహకార సంఘాలు..
ప్రభుత్వం నిర్ణయంతో సహకార సంఘాలు బలోపేతం కానున్నాయి. పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, ఇతరులు నేరుగా అధికారులను సంప్రదిస్తున్నారు. సొసైటీల పరిధిలో ఉన్న వారికి వలలు, వ్యాపారాభివృద్ధికి సైకిళ్లు, నిల్వ ఉంచేందుకు ఐస్ బాక్సులను ప్రభుత్వం అందజేయనుంది. సొసైటీ లో ఉన్న వారికి జీవిత బీమాను సైతం రూ.2 లక్షలకు పెంచిం ది. మరిన్ని సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ద్ధం చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేలా మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇత ర రాష్ర్టాలకు పంపించి తర్ఫీదు ఇస్తున్నారు. కేజ్ కల్చర్ ద్వారా పైలెట్ ప్రాజెక్టుతో పలు జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేశారు. ఈ బృహత్తర విధానంతో చేపల పెంపకం వృత్తిగా ఉన్న ముదిరాజులు, గంగపుత్రులు, వృత్తిపై ఆదారపడిన ఇతర కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...