టీఆర్‌ఎస్ వెంటే జనమంతా

Thu,September 20, 2018 12:31 AM

-బొగ్గుగనుల వద్ద జలగం విస్తృత ప్రచారం
-దమ్మపేటలో తాటి పర్యటన
- పినపాకలో పాయంకు మద్దతు ప్రకటించిన కార్మికులు
-అభివృద్ధి పనుల్లో ఎంపీ సీతారాంనాయక్, బాలసాని గ్రామాల్లో కోరం ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జనమంతా టీఆర్‌ఎస్ వెంటే ఉంటూ అభ్యర్థులకు గ్రామాల్లో బ్రహ్మరథం పడుతునారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారాలతో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో జిల్లాలో సంపూర్ణంగా అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ అభ్యర్థులు జలగం వెంకటరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటివెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావులు తమ నియోజకవర్గాల పరిధిలో ప్రజలను కలుసుకుంటూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన అవసరాన్ని విశదీకరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా గులాబీ పార్టీ నేతలకు ప్రజలకు నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇతర పార్టీల నుంచి అనేక మంది టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. బొగ్గుగని కార్మికుల నుంచి కాంట్రాక్టు కార్మికుల వరకు, తండాలు, గూడాల నుంచి అనేక మంది టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలుస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

బుధవారం నాడు జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే 7షాప్ట్ బొగ్గుగని, జీఎం కార్యాలయం, రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్‌సీహెచ్‌పీ), ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ (వీటీసీ)లలో కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులు ఆయనకు స్వచ్చందంగా మద్దతును ప్రకటించారు. వీకే7షాప్ట్ గని ఆవరణలోని క్యాంటీన్‌లో కార్మికులతో కలిసి అల్పాహారం తిన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని భారీ మెజార్టీతో గెలిపిస్తామని భరోసా ఇచ్చారు. రామవరం ఎస్‌సీబీ నగర్‌లో గణేష్ మంటపాలను సందర్శించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డు గంగాబిషన్ బస్తీలో గణేష్ మంటపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో గణేష్ మంటపాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మంటపాల నిర్వాహకుల కమిటీ సభ్యులు జలగంకు ఘన స్వాగతం పలికారు. ఇల్లెందు పట్టణంలోని బీడీ కాలనీలో నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి.

క్యాంపు కార్యాలయంలో 20 మంది కాంట్రాక్టు కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కోరం కనకయ్యకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. టేకులపల్లి మండలం తడికల పుడి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ ఇల్లెందులోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కోరం కనకయ్య భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణలు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భద్రాచలం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ తో కలిసి భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐటీసీ బీపీఎల్ ఆధ్వర్యంలో రూ.11 లక్షల విలువైన నోట్ బుక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా,మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మద్దతుగా సింగరేణి బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్ ముఠా కార్మికులు సుమారు వంద మంది పాయం గెలుపుకోసం కృషి చేస్తామని మద్దతు ప్రకటించారు. పాయం సతీమణి ప్రమీల పినపాక మండలం టీ.కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అశ్వాపురం మండలంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సమావేశమై ఎన్నికల ప్రచారంపై కార్యాచరణ రూపొందించారు. అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి, తాజా, మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట మండలంలో పర్యటించారు. ఎన్నికల ప్రచారానికి పార్టీ శ్రేణులు అన్ని గ్రామాల్లో సిద్దం కావాలని కోరారు.

175
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles