బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం

Thu,September 20, 2018 12:29 AM

-టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి తాటి వెంకటేశ్వర్లు
దమ్మపేట:ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని అశ్వారావుపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, అన్నారు. బుధవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లిన ఘన త సీఎంగా కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బంగారు తెలంగాణ ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఇంటింటికి కార్యకర్తలు, నాయకులు తిరిగి కేసీఆర్ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తాటి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటర్లు ఓటువేయాలని అభ్యర్థ్ధిస్తున్నట్లు తెలిపారు. గతంలో తనను ఆశీర్వదించి ఈ అవకాశం కల్పించారని మళ్లీ గెలిపించాలని కోరారు.

120
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles