కోరం కనకయ్య గెలుపు ఖాయం

Thu,September 20, 2018 12:27 AM

ఇల్లెందు నమస్తే తెలంగాణ: కోరం కనకయ్య గెలుపు ఖాయమని మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు అజ్మిర సీతారాంనాయక్ అన్నారు. బుధవారం రాత్రి ఇల్లెందు క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోరం కనకయ్య సమర్థవంతమైన నాయకుడని, అన్ని వర్గాలు కోరం కనకయ్యను బలపరుస్తున్నాయని సర్వేలో తేలిందన్నారు. నియోజకవర్గంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు కోరం కనకయ్యను బలపరుస్తున్నారని చెప్పారు. కేసీఆర్ అది గుర్తించి కోరం కనకయ్యే ఇల్లెందుకు సరైన నాయకుడని ప్రకటించారన్నారు. అందుకే కోరం కనకయ్య భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు అస్త్ర సన్యాసం తీసుకుందని తెలిపారు. కేసీఆర్ ముందస్తు వెళ్లడంలో ఓ ప్రణాళిక ఉందన్నారు. ఉద్యమకారుడిగా కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశారని, త్యాగంలో భాగమే ముందస్తు అని అన్నారు.

ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయని, వాటి కాకిగోలను అరికట్టేందుకు ముందస్తుకెళ్లి భారీ మెజార్టీతో గెలవాలని నిశ్చయించుకున్నారన్నారు. ఇప్పుడు 100 సీట్లతో ప్రతిపక్షాలు లేని ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా ఏర్పడ్డారే తప్ప ఇంతవరకు అభ్యర్థ్దులను ఎక్కడా ప్రకటించలేదన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ గెలుపును మానసికంగా కూటమి ఒప్పుకుంటుందని, అందుకే అస్త్రసన్యాసం తీసుకుందన్నారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరావు, మడత వెంకట్‌గౌడ్, కనగాల పేరయ్య, పులిగళ్ళ మాధవరావు, సిలివేరి సత్యనారాయణ, గడ్డం వెంకటేశ్వర్లు, పడిదల నవీన్, జాని తదితరులు పాల్గొన్నారు.

179
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles