ఘనంగా రాములోరి నిత్యకల్యాణం

Thu,September 20, 2018 12:26 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ఆరాధన, అర్చన, పుణ్యఃవచనం, సేవాకాలం, నివేదన తదితర పూజలు గావించారు. అనంతరం అర్చకులు రామాలయంలోని బేడా మండపంలో రామయ్యస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles