కేటీపీఎస్‌లో ఆర్టీజన్ ఉద్యోగుల సంబురాలు


Wed,September 19, 2018 01:03 AM

పాల్వంచ:విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టీజన్ల సర్వీ సులను క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో, డిస్కమ్‌లలో పనిచేస్తున్న 23వేల మంది ఆర్టీజన్ల (ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు) క్రమబద్ధీకరణకు అడ్డంకులు తొలగిపోవడంతో కేటీపీఎస్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్‌ఎస్ అనుబంధం) ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నా రు. పటాకులు కాల్చి,స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ను కీర్తిస్తూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ,టీఆర్వీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఆర్టీజన్ కార్మికులు రెగ్యులర్ అయ్యే లా కృషి చేసిన జెన్కో సీంఎడీ దేవులపల్లి ప్రభాకర్ రావుకు, అలాగే టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కేవీ జాన్సన్, కోడూరి ప్రకాష్‌లకు ఆర్టీజన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డోలి శ్రీనివాస్, రాష్ట్ర అదనపు కార్యదర్శి వి.దుర్గా అశోక్, పరమేష్,ఆర్ శ్రీనివాస్, సుభాని, మహేందర్, మనోహర్, ఖాన్, ఉబ్బన కృష్ణమూర్తి, మేదర రమేష్, తోట కోటేశ్వరరావు, రాజేష్‌బాబు, పుల్లంరాజు, కాంతయ్య, మసూద్, హబీబ్, శ్రీనివాస్, బాలకృష్ణ, అశోక్, శంకర్, గణపతి, శివయాద్, బీ క్యా, శ్రీరామ్, ప్రభాకర్, యాక య్య, సతీష్, వీరస్వామి, డేవిడ్, రమేష్, కమలా, రాంబాయ్ తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...