టీఎస్ ఆయిల్‌ఫెడ్‌దే ఉన్నత స్థానం


Wed,September 19, 2018 01:02 AM

-ఆయిల్‌పాం సాగుకు గాడ్‌ఫాదర్ తుమ్మలే
-ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
దమ్మపేట, సెప్టెంబరు 18 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుగా ఆయిల్‌ఫెడ్‌కు రూ.10కోట్లు ఇవ్వడంతో పాటు 90 కోట్లకు గ్యారంటీగా ఉండి మండల పరిధిలోని అప్పారావుపేట కర్మాగారాన్ని రూ.100 కోట్లతో నిర్మించారని, దీని ఫలితంగా టీఎస్ ఆయిల్‌ఫెడ్‌కు భారతదేశంలోనే అత్యున్నత స్థానం దక్కిందని టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో పామాయిల్ తోటలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన పామాయిల్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్‌తో కలిసి అప్పారావుపేట ఫ్యాక్టరీని సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆయిల్‌పాంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాడ్‌ఫాదర్ అని చైర్మన్ పేర్కొన్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పరిశ్రమలన్నీ నిర్వీర్యమయ్యాయని, అందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణం అన్నారు. తొలుత చైర్మన్ రెండు మండలాల్లో పర్యటించి పామాయిల్ తోటలను పరిశీలించారు. అనంతరం పామాయిల్ రైతుసంఘం నాయకులు ఆయిల్‌ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎంపీపీ అల్లం వెంకమ్మ, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ పైడి వెంకటేశ్వరరావు, సభ్యులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఆత్మ చైర్మన్ కేదాసి వెంకటసత్యనారాయణ(కేవీ), రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం కార్యదర్శి శీమకుర్తి వెంకటేశ్వరరావు, కాసాని వెంకటేశ్వరరావు, కాసాని నాగప్రసాద్, ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, రెండు మండలాల పామాయిల్ రైతులు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...