జై టీఆర్‌ఎస్

Tue,September 18, 2018 12:45 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర సాధనను ఎంత పట్టుదలతో కృషి చేశారో అంతే పట్టుదలతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండాలుగా పట్టుదలతో పనిచేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతిరథ చక్రాలు ఆగిపోకూడదనే ముందస్తు ఎన్నికల బరిలో నిలిచారని టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రజలకు చాటిచెప్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గడిచిన 50 నెలల కాలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన ప్రచార అస్ర్తాలుగా ఎంచుకొని ఎన్నికల ప్రచారంలో తిరిగి కేసీఆర్ సీఎం కావాలని, ఆయన నాయకత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గులాబీ జెండాకు ప్రజలంతా అండగా నిలిచి కారు గుర్తుకు ఓట్లు వేసి ఎదురులేని శక్తిగా గెలిపించాలని కోరుతున్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ వెంకట్రావ్, మిరియాల రాజిరెడ్డి జిల్లాలో పర్యటించి సింగరేణి కార్మికులంతా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, సీఎం కేసీఆర్‌కు కోల్‌బెల్టు ప్రాంత అసెంబ్లీ స్థానాలపై గులాబీ జెండా ఎగురవేసి కానుకగా ఇవ్వాలని కోరారు. సింగరేణి టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి జలగం వెంకటరావు, పినపాక నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాల్లో పర్యటించి కార్మికులను ఓట్లు వేయాలని కోరారు. విద్యుత్ శాఖలోని 1104 తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులంతా సమావేశమై కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో పర్యటించారు. పార్టీ శ్రేణులు సమావేశమై బూత్‌కమిటీల వారీగా ఎన్నికల ప్రచార కార్యక్రమంపై కసరత్తు చేపట్టారు. ఇల్లెందు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరంకనకయ్య నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈసందర్భంగా 170 కుటుంబాలు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల వారంతా ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఓటర్లను చైతన్యవంతులను చేస్తూ కొత్త ఓటర్లుగా అర్హత ఉన్న వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మార్పు, చేర్పులు, సవరణలపై ప్రజలందరికీ సమాచారం అందిస్తూ పోలింగ్ బూత్‌ల వారీగా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఓటు విలువను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలని, అర్హత ఉండి పేర్లు లేని వారు, చిరునామాలు మారి ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోయిన వారు తమ పేర్లను చేర్చుకొని ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా తమ బాధ్యతను నిర్వర్తించాలని ప్రచారం చేస్తున్నారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీవెంకట్రావ్, మిరియాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుతో సోమవారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కోల్‌బెల్టులో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపునకు టీబీజీకేఎస్ తమవంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.

128
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles