కార్మికులు ఎప్పుడూ టీఆర్‌ఎస్ వెంటే..


Tue,September 18, 2018 12:44 AM

-రాంపురంలో భూగర్భగని ఏర్పాటు
-ఎన్నడూ, ఎప్పుడూ లేనంత అభివృద్ధిని చేస్తున్నాం
-అక్షయపాత్ర, అన్నపూర్ణ పథకాన్ని అందిస్తున్నాం
రామవరం: ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి ఎన్నికల్లో జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్ను గెలిపించడమే కాకుండా సింగరేణి సంస్థలో రెండోసారికూడా టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ను గెలిపించి సింగరేణి ఉద్యోగులు టీఆర్‌ఎస్ వెంటనే అంటూ నిరూపించిన ఘనత సింగరేణి ఉద్యోగులకే దక్కందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. సోమవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని జీకేవోసీ, ఏరియావర్క్‌షాపులో టీజీబీకేఎస్ నాయకులు ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత వెంకటరావుకు ఉద్యోగులు పూలమాల, శాలువాలతో సత్కరించి, సింగరేణి టోపీని బహూకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశంలో నంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు అదే స్ఫూర్తితో కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రామవరంలో 18 ఎకరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని, ఎస్టీ గురుకులు పాఠశాల నిర్మించామన్నారు.


70 ఎకరాల్లో సీఆర్‌పీఎఫ్ క్యాంపు..
మైనార్టీ విద్యార్థులకోసం మైనార్టీ గురుకుల పాఠశాల, ఎస్టీ మహిళ డిగ్రీ కళాశాల, కృషీవిజ్ఞానకేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా మనదగ్గరే ఏర్పాటుచేశామన్నారు. 70 ఎకరాల్లో సీఆర్‌పీఎఫ్ క్యాంపును ఏర్పాటచేస్తున్నామని, కేంద్రీయ విశ్వవిద్యాలయం, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో డీఎంఎఫ్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి 24 గంటలు నల్లా నీరు అతి త్వరలో అందించేందుకు ఇప్పటికే పాలిటెక్నిక్ పక్కన ట్యాంకు నిర్మాణం పూర్తయిందన్నారు. కొత్తగూడెంలో అంబేద్కర్ భవన్‌కోసం కోటి రూపాయలు మంజూరు చేశామని, కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఏర్పాటుచేసి స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాన్‌డియర్ కంపెనీతో ఒప్పందం చేసుకొని స్కిల్ డవలప్ మెంట్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా కొత్తగూడెంలో ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటి వరకు 15 మందికి శిక్షణ ఇవ్వగా 14 మంది శిక్షణ పూర్తిచేసుకొని కంపెనీల్లో పనిచేస్తున్నారన్నారు. నీటుపారుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సింగబూపాలెం చెరువును అభివృద్ధి పరిచామన్నారు.

వాగులపై చెక్‌డ్యాంపులు నిర్మించాం..
మొర్రేడు కిన్నెరసాని వాగుల నుంచి ప్రతీ ఏడాది 25 టీఎంసీల నీటిని వాడుకోకపోవడంవల్ల ఇవి గోదావరిలో కలసి సముద్రం పాలవుతున్నాయని, వాటిని ఆపేందుకు ఆయా వాగులపై చెక్‌డ్యాంపులు నిర్మించామన్నారు. చెక్‌డ్యాంపులు నిర్మించడం వల్ల మత్య్యకారులు చాపలను పెంచుకొని లాభం పొందుతున్నారన్నారు. పాతకొత్తగూడెంలో రాష్ట్రంలోనే మొదటి సారిగా ప్రభుత్వ ఇంగ్లిష్‌మీడియం పాఠశాలను ఏర్పాటుచేసి సుమారు 3వేల మందికి పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యా బోధనను అందిస్తున్నాం. ఇవ్వన్నీ మీ సహాయ సహకారాలతోనే సాధించగలిమాని, వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేందుకు మీ సహాయ సహకారాలు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ప్రాంతంలో ఆరోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సింగరేణి సీఅండ్‌ఎండీ రామన్ ఆధ్వర్యంలో సింగరేణి సహకారంతో కిన్నెరసానిలో అద్దాల మేడను నిర్మించిమాని, అది కొన్ని కారణాలవల్ల శిథిలమైందని దీనిని పర్యాటక రంగాన్ని అభివృద్ధిపర్చాలనే లక్ష్యంతో అద్దాల మేడను పునఃనిర్మిస్తున్నామన్నారు. రిజర్వాయర్‌లో బోటింగ్ ఏర్పాటు చేశామని దీనిని ఇప్పటివరకు 1 లక్ష 50 వేల మంది సందర్శకులు దీనిని వినియోగించుకున్నారని వారు గుర్తు చేశారు.

అక్షయపాత్ర ద్వారా 16 వేల మందికి పోషకాహారం
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌కోసం పాత మ్యాగ్జెన్‌లో ప్రాంతంలో రెండు ఎకరాల భూమినికూడా కేటాయించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అక్షయపాత్ర ద్వారా 16 వేల మందికి ఉచిత పోషకాహారాలతో కూడిన భోజనాన్ని అందిస్తున్నామన్నారు. కొత్తగూడెం సూర్యాప్యాలెస్ వద్ద అన్నపూర్ణ పథకం ధ్వారా రూ.5కే భోజనాన్ని అందిస్తున్నామని ఇది రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత కొత్తగూడెంలో ఏర్పాటు చేశామనిన్నారు. మైనింగ్ టూరిజం హెమచంద్రాపురం వద్ద పెట్టించే కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. సింగరేణి కంపెనీ దాని వైభవాన్ని అందిరికీ తెలిసేవిధంగా మైనింగ్ టూరిజయంను ఏర్పాటుచేయబోతున్నామని పేర్కొన్నారు.

కేటీపీఎస్ 7వ దశ నిర్మాణం..
కేటీపీఎస్ 7వ దశ నిర్మాణం పూర్తికావొస్తుందని, దీనికి సుమారు రూ. 5వేల 3 వందల కోట్లతో నిర్మాణం చేపడుతున్నాం. భారతదేశంలో అత్యధికంగా ఉత్తత్తిసామార్థ్యంగల ఎ,బీ,సీ స్టేషన్స్ ఆరోజుల్లో జలగం వెంగళరావు నిర్మించారని గుర్తుచేశారు. 50 ఏళ్లు పూర్తికావొస్తుందన్నారు. కొత్తయూ నిట్‌నుకూడా పెట్టే కార్యక్రమం మొదలవుతుందన్నారు. మన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, వాటికి నిధులు అడిగామని దానికి సానుకూలతను తెలిపారు. ఈ సింగరేణి కార్మికులు అందరికీ వెలుగునిస్తున్నారని వారి జీవితాల్లో వెలుగు నివ్వాలని లక్ష్యంతో పనిచేస్తున్నాని నన్ను ఆశీర్వదించాలని అన్నారు. ప్రాణ నష్టం జరుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో జీకేవోసీ, ఏరియా వర్క్ షాపు పిట్ సెక్రటరీలు చెరిపల్లి నాగరాజు, సత్తార్‌పాషా, టీబీజీకేఎస్ నాయకులు తిమ్మిరి నరేంద్రబాబు, సంగా పద్మారావు, రాములు, మురాద్, గౌరిశెట్టి రవి, కొంకటి కృష్ణ, మంగ రమేష్, కోటిరెడ్డి, ఆంజనేయులు, ఈశ్వర్, గోపు కుమార్, పసుపులేటి కొమరయ్య, పల్లారపు కొమరయ్య లక్ష్మీనారాయణ, సాంబయ్య, గణేష్, గాదం శివరాం, సీహెచ్.శ్రీనివాస్, కోళ్లరమేష్, యాదగిరి, వై సత్యనారాయణ, ఏరియా వర్క్‌షాపు టీబీజీకేఎస్ నాయకులు సమ్మయ్య, సంజీవ్, త్రిమూర్తి, జోసఫ్‌రాజు, మోహన్‌రావు, అత్తార్, రాజేశ్వరర్‌రావు, జాని, స్వామి, ఫోర్‌మెన్‌లు, సూపర్‌వైజర్లు, ఎల్రక్ట్రిషియన్‌లు, సేఫ్టీ కమిటీ మెంబర్లు, టీఆర్‌ఎస్ నాయకులు జీవీకే మనోహర్, జీకే సంపత్, పరమేష్ పాల్గొన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles