నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుక

Thu,September 13, 2018 12:47 AM

రఘునాథపాలెం, సెప్టెంబర్ 12: తెలంగాణ ఉద్యమ పత్రికగా పురుడుపోసుకున్న నమస్తే తెలంగాణ.. నాలుగున్నర కోట్ల ప్రజల గోంతుకై ప్రత్యేక రాష్ట్ర సాధనలో గళాన్ని వినిపించిందని ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి వీ వెంకటాయపాలెంలో గల నమస్తే తెలంగాణ పత్రిక యూనిట్ కార్యాలయంలో బుధవారం నూతన ప్రింటిం గ్ మిషనరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా బ్యూరో ఇన్‌చార్జ్ పొనుగోటి రవీందర్, ఎడిషన్ ఇన్‌చార్జ్ కే.పూర్ణచందర్, బ్రాంచ్ మేనేజర్ బీఎస్ రాఘవేంద్రరరావులు ముఖ్య అతిథికి సాదర స్వాగతం పలికారు. అనంతరం అజయ్‌కుమార్ స్విచ్ ఆన్‌చేసి నూతన ప్రింటింగ్ మిషన్‌ను ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నమస్తే తెలంగాణ పత్రిక.. ఉద్యమ దివిటీగా అవతరించి అక్షర విల్లుంబులను ఎక్కుపెట్టిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రంలో ఏర్పటైన తెలంగాణ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాల ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోషిస్తోందని ప్రశంసించారు.

ఇదే ఒరవడితో పని చేస్తూ నమస్తే తెలంగాణ ప్రజల గొంతుకగా ప్రజాపక్షాన నిలవాలని పత్రిక యాజమాన్యానికి అజయ్‌కుమార్ సూచించారు. అనంతరం నూతన మిషన్‌పై ప్రింటింగ్ అయి వచ్చిన పత్రికలను ఎమ్మెల్యే స్వయంగా తీసి ముద్రణ, నాణ్యత తీరును పరిశీలించారు. కొత్త మిషన్ నుంచి మొట్టమొదటిగా ముద్రితమై వచ్చిన పత్రికలను పత్రిక బాధ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం యూనిట్ కార్యాలయం మొత్తం కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన అజయ్‌కుమార్‌ను పత్రిక స్టేట్ చీఫ్ జనరల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు, బ్యూరో ఇన్‌చార్జ్, ఎడిషన్ ఇన్‌చార్జ్, బీఎంలు శాలువాలతో సన్మానించారు. పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి లోగాని శ్రీనివాస్, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్ కాసర్ల జనార్దన్, ఏసీఎం అజయ్, యాడ్స్ మేనేజర్ బోయిన శేఖర్, రఘునాథపాలెం రిపోర్టర్ బోయిన కృష్ణ, యూనిట్ ఆఫీసుకు చెందిన పలు విభాగాల సిబ్బంది, యాడ్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

156
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles