జలగం వెంకటరావుకు సీఎం కేసీఆర్ ఫోన్


Thu,September 13, 2018 12:46 AM

-గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలనీ సీఎం కేసీఆర్ ఆదే శించారు. బుధవారం కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ప్రచారం జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అను గుణంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు విశదీకరించి ఆ యన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వ హించి, నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రజలందరి సహకారంతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఈ సందర్భంగా జలగం వెంకటరావు తెలిపారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...