కంటి వెలుగు పరీక్షలు


Wed,September 12, 2018 01:18 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : కంటివెలుగు శిబిరాలకు ప్రజలు క్యూ కట్టారు. ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెట్టుకున్న వారు కంటి పరీక్షలు చేయించుకోవడానికి పరుగులు తీస్తున్నారు. మంగళవారం నాడు 4343 మందికి కంటి పరీక్షలు చేశారు. వార్డు వార్డుకు, గ్రామగ్రామాన శిబిరాలను ఏర్పాటు చేయడంతో ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు అనుసంధానంతో కంటి పరీక్షలు నిర్వహించడం వల్ల ఎవరు, ఎక్కడి వారైనా క్షణాల్లో కంటి పరీక్షలు చేసి వారి సమస్యకు పరిష్కారం చూపెడుతున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న వైద్య శిబిరాలు తమ గ్రామాలకు ఎప్పుడొస్తాయని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 23 మండలాల్లో ఆయా ప్రాంతాల వారికి దగ్గరగా వారి పనులు ఆటంకం కలుగకుండా ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ శిబిరంలో ఒక ఆప్తాలమిస్ట్ ప్రత్యేక పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్లు ఉన్న వారికి కంటి ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 82,230 మందికి కంటి పరీక్షలు
గత 18 రోజులు నుండి జరుగుతున్న కంటి వైద్యశిబిరాలకు గ్రామాల్లో అపూర్వ స్పందన లభిస్తుంది. ఇప్పటి వరకు జిల్లాలో 82,230 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 19, 715 మందికి కళ్లద్దాలు ఇవ్వడం జరిగింది. మంగళవారం నాడు 4343 మందకి పరీక్షలు చేయగా 19 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 192 మందికి శస్త్రచికిత్సలు చేశారు. కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షల ద్వారా గుర్తించిన వారిని ఆపరేషన్లు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. రోజుకు 30 మందికి చొప్పున కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఉచితంగా చేస్తున్న ఈ ఆపరేషన్లు మూడు రోజుల్లోనే రోగులు ఇంటికెళ్తున్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...