కదన రంగంలోకి గులాబీ దళం..


Wed,September 12, 2018 01:16 AM

-తెల్లం సొంత మండలంలో రెండవరోజు ప్రచారం
-కొనసాగుతున్న జోరు
దుమ్ముగూడెం : ఏజెన్సీ మండలంలో గులాబీ దళం కదనరంగంలో దూసుకుపోతుంది. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టి అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ భద్రాచలం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన సొంత మండలంలో రెండవ రోజు ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. మండల పరిధిలోని మంగళవారం నర్సాపురం నుంచి నారాయణరావుపేట గ్రామం వరకు కాలినడకన విస్తృత పర్యటన నిర్వహించారు. మండల పరిధిలోని మారేడుబాక, కొత్త మారేడుబాక, సింగారం, గంగారం, పౌలులూరిపేట, బొజ్జికుప్ప గ్రామాల్లో ఆయన పర్యటన ఆధ్యంతం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా అభ్యర్ధి డాక్టర్ తెల్లంతో పాటు భద్రాచలం టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానే రామకృష్ణలు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి అవసరమైన అన్ని పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తాజాగా రైతులకు రైతుబీమాను ప్రవేశపెట్టి ఒకవేళ రైతు ఏ కారణం చేతైనా మరణిస్తే ఆ రైతు కుటుంబానికి నామినీగా ఉన్న వ్యక్తి ఖాతాల్లోకి మరణించిన మూడు రోజుల్లోనే రూ.5లక్షల బీమాను అందిస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని పెద్దలను కలుసుకోవడంతో ఈసారి భద్రాచలం నియోజకవర్గ సీటు రెండు రోజుల ప్రచారానికే 5వేల మెజార్టీతో డాక్టర్ తెల్లం విజయం సాధిస్తారని పలువురు పెద్దలు చెబుతున్నారు. ఈ ప్రచారంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోటమళ్ల సుధాకర్, జడ్పీటీసీ అన్నెం సత్యాలు, కార్యదర్శి కణితి లక్ష్మణ్, కో-ఆప్షన్ సభ్యులు ఎండీ.జానీపాషాజానీపాషా, సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బత్తుల శోభన్, రాంబాబు, నాగరాజు, ఆదినారాయణ, కృష్ణ, కల్లూరి రవి, కామేష్ పాల్గొన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...