భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న కలెక్టర్

Wed,September 12, 2018 01:16 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారా మచంద్రస్వామివారిని కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ మంగళవారం దర్శించు కున్నారు. రామాలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామాలయంలోని గర్భగుడిలో స్వామివారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కలెక్టర్‌కు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు కలెక్టర్‌కు శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఆలయ విశిష్టతను కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్, ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, అర్చకులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles