రెండో విడత గొర్రెలకు డీడీలు తీయాలి


Wed,September 12, 2018 01:16 AM

-జిల్లా యాదవ సంఘం సమావేశంలో డీడీ వేణుగోపాల్
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : రెండో విడత గొర్రెలకు ఎవరికీ వారే డీడీలు తీయాలని, గతంలోమాదిరిగా అవకతవకలకు పాల్పడవద్దని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన యాదవ, గొల్ల కురుమల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈసారి ఎవరి డీడీలు వారే ఆయా మండలాల్లో వైద్యులకు అందించాలని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి గొర్రెలు తీసుకురావటం మూలంగా ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక మృతిచెందుతున్నాయని ఫిర్యాదులు అందాయని, దీంతో ఈసారి మనకుఅనుకూలమూన వాతావరణంలో ఉండే ఆంధ్రా ప్రాంతం నుంచి గొర్రెలను తీసుకురావడం జరుగుతుందన్నారు. జరుగుతుందన్నారు. భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గతంలో రాయ్‌చూర్ ప్రాంతం నుంచి గొర్రెలు తీసుకొచ్చే విధంగా అధికారులు నిర్దేశించారని, కానీ యాదవ సంఘం నాయకులు దానిని వ్యతిరేకించి రాయ్‌చూర్ గొర్రెలు తమకు వద్దని, ఆంధ్రా ప్రాంతంలో ఇక్కడి వాతావరణానికి సరిపడా గొర్రెలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకాశం జిల్లాలోని పెదారుపాడు, ఆర్లపాడు, కంభంపాడు మండలాల్లో ఈ గొర్రెలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపిందన్నారు. ఈ విజయం యాదవ సంఘానికే చెందుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ డీడీలు తీసిన లబ్దిదారులు గొర్రెలను పెంచుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేసుకోవాలన్నారు. ఇందుకు సంఘం నాయకులు బాధ్యత తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో జేడీ వెంకయ్య, అఖిల భారత యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు మచ్చా శ్రీనివాస్, దొడ్డాకుల రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు పరమేష్ యాదవ్, వల్లపు యాకయ్య, గోసు రామారావు, చిన్నం రామకృష్ణ, జడ వెంకయ్య, సాంబ పూర్ణచందర్‌రావు, జిల్లాలోని అన్ని మండలాల యాదవ సంఘం సభ్యులు, గొర్రెల కాపరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...