పరుగుపందెంలో మోహిత్‌కృష్ణకు రజతం...


Wed,September 12, 2018 01:15 AM

కొత్తగూడెం స్పోర్ట్స్ : 25వ గోల్డెన్ మైల్ రన్-2018, హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ జంప్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి భూక్యా మోహిత్ కృష్ణ తన సత్తాను చాటాడు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలోజరిగిన గోల్డెన్ మైల్‌లో 300 మీటర్ల పరుగు పందెంలో మోహిత్‌కృష్ణ నాల్గవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. రజతం సాధించిన మోహిత్‌కృష్ణ కొత్తగూడెంలోని న్యూస్టార్ అథ్లెటిక్స్ క్లబ్ తరపున కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోచ్‌లు ఎం.నరేష్, సముద్రాల శ్రీనివాస్‌లు, పట్టణ సీనియర్ క్రీడాకారులు మోహిత్‌కృష్ణను అభినందించారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...