త్రివేణిలో విద్యార్థులకు మోటివేషన్ తరగతులు


Wed,September 12, 2018 01:15 AM

లక్ష్మీదేవిపల్లి : మండల కేంద్రంలోని త్రివేణి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఏదైనా ఒక పనిని చేసే ముందు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, ఆత్మవిశ్వాసం ఉన్న వారు అన్వేషించే స్వభావం ఏర్పర్చుకుంటారని అన్నారు. ప్రతీ విషయాన్ని సైన్స్ దృక్కోణంలో ఆలోచించాలని అప్పుడే సృజనాత్మకత పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గొల్లపూడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, సీఆర్వో కాట్రగడ్డ మురళీకృష్ణ, జెడ్‌ఏవో అనీల్, ప్రిన్సిపాల్స్ రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్‌సింగ్, సురేష్, రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...