జోనల్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

Wed,September 12, 2018 01:15 AM

-ప్రారంభించిన డీఈవో వాసంతి
కొత్తగూడెం స్పోర్ట్స్ : కొత్తగూడెం జోనల్ స్థాయి క్రీడా పోటీలు మంగళవారం నుంచి రామవరంలోని భారత్ పబ్లిక్ స్కూల్‌లో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా డీఈవో వాసంతి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అప్పుడే విద్యార్థుల్లో సంపూర్ణమైన వికాశం సమగ్ర అభివృద్ధి చెందుతారన్నారు. అంతకు ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల అధికారి రామారావు, జోనల్ కన్వీనర్ ఆనంద్, ఎంఈవో వెంకటేశ్వరరావు, డీసీఈబీ అధికారి మాధవరావు, ప్రిన్సిపల్ గోపీనాథ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles