నెలరోజుల్లో పెండ్లి.. ఈలోపే మృత్యుఒడిలోకి..


Wed,September 12, 2018 01:14 AM

పాల్వంచ : నెలరోజుల్లో పెండ్లి జరగాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల ఇలా ఉన్నాయి.. చర్ల మండలం సుబ్బంపేట వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్వంచ పట్టణం గొల్లగూడెంకు చెందిన చింతా వెంకటేష్(26) అతని మిత్రుడు ప్రవీణ్(26)లు మృతిచెందారు. మృతుల్లో వెంకటేశ్ స్థానిక కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారంలో జేపీఎగా పనిచేస్తున్నాడు. మరో మిత్రుడు వెంకటేశ్ కూడా కేటీపీఎస్‌లో ఆర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేష్ తండ్రి జానకిరాములు అనారోగ్యంతో మృతిచెందడంతో ఇతనికి కేటీపీఎస్‌లో ఏడాదిన్నర క్రితం ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆతనికి ఈనెల 4వ తేదీన బంధువుల అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అక్టోబర్ 11వ తేదీన వివాహం నిశ్చియించారు. ఈ నేపథ్యంలో మిత్రులతో కలిసి సరదాగా అతని కారులో బొగత జలపాతాన్ని చూసి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆ కుంటుంబం శోకసద్రంలో మునిగిపోయింది. కుటుంబంలో ముగ్గురు అమ్మాయిల తర్వాత ఆఖరి ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...