అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లిన బస్సు..


Wed,September 12, 2018 01:13 AM

జూలూరుపాడు: మండలంలోని కొమ్ముగూడెం గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ప్రధాన రహదారి పక్కనేఉన్న కల్వర్టులోకి దూసుకుపోయిన సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మంనుంచి భద్రాచలానికి వస్తుండగా జూలూరుపాడు వైపు వచ్చే డీసీఎం వ్యాన్ డ్రైవర్ నర్సింహాం ముందు వెళ్తున్న ఆటోను అధిగమించే క్రమంలో కొమ్ముగూడెం వద్ద బస్సు మీదకు వేగం గా దూసుకొచ్చింది. గమనించిన బస్సు డ్రైవర్ యాలాద్రి అప్రమత్తంగా వ్యవహరించి బస్సును పక్కకు తప్పించే క్రమంలో పెద్దమ్మతల్లి ఆలయం వద్ద కల్వర్టు గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొత్తగూడెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ షేక్ మస్తాన్‌బీ, సారపాకకు చెందిన పసుమర్తి అన్నపూర్ణతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని కానిస్టేబుల్ శివాజీ గణేష్, రామకృష్ణలు సందర్శించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం రహీంపేటకు చెందిన డీసీఎం డ్రైవర్ నర్సింహా మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలింది. దీంతో డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...